: కేంద్రమంత్రి చౌధురి ప్రకటనను పరిశీలిస్తున్నాం... త్వరలోనే ప్రధానిని కలుస్తాం: దేవినేని ఉమా


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతోంటే... ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిన అవసరమేమీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి చేసిన ప్రకటన ఏపీలో కలకలం రేపుతోంది. విపక్షాలతో పాటు బీజేపీ మిత్రపక్షం, ఏపీలో అధికార పార్టీ టీడీపీ కూడా ఈ ప్రకటనను కాస్తంత తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ క్రమంలో నేటి ఉదయం విజయవాడలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా ముందుకు వచ్చారు. కేంద్ర మంత్రి చౌధురి చేసిన ప్రకటనను పరిశీలిస్తున్నామని చెప్పిన దేవినేని... త్వరలోనే దీనిపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. అంతేకాక ఏపీకి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కూడా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News