: ప్రధాని విద్యార్హతలు చెప్పాలన్న ఢిల్లీ సీఎం!... వివరాలివ్వాల్సిందేనన్న సమాచార కమిషనర్!


దేశ ప్రధాని ఏం చదివారో ప్రజలకు తెలియాల్సిందేనని ఓ ముఖ్యమంత్రి అన్నారు. ఆ ముఖ్యమంత్రి డిమాండ్ సబబేనని సమాచార కమిషనర్ తేల్చేశారు. ఇంకేముంది... ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ విద్యార్హతలు త్వరలోనే సవివరంగా వెలుగుచూడనున్నాయి. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ సరైనదేనని జాతీయ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ తేల్చేశారు. ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన వివరాల వెల్లడికి చర్యలు చేపట్టాలని శ్రీధర్... ప్రధాన మంత్రిత్వ కార్యాలయం, ఢిల్లీ, గుజరాత్ విశ్వవిద్యాలయాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికి సంబంధించిన విద్యార్హతలను అడిగినప్పుడు వివరాలు ఇవ్వడం సబబుగా ఉంటుందని సదరు ఆదేశాల్లో శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News