: బీజేపీ నేతలపై విరుచుకుపడ్డ హీరో శివాజీ... తీవ్ర వ్యాఖ్యలు
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న కేంద్ర మంత్రి హెచ్ పీ చౌదరి వ్యాఖ్యలపై హీరో శివాజీ ఘాటుగా స్పందించారు. ఈ విషయమై ఒక ఛానెల్ తో ఆయన ఫోన్ లో మాట్లాడుతూ, ‘ఎలా చూసే దేముందండి, ఇవాళ చూడాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుగారి చేతుల్లోనే ఉంది. చంద్రబాబునాయుడు గారు మొన్న కూడా అన్నారు ఏమని,‘అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదని’. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల ఎలా వ్యవహరిస్తున్నదీ సాక్షాత్తూ ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ, సన్నాసి మంత్రెవడో ఒకడు చెప్పాడని చెప్పి, ఆయనకు తెలియదేమో.. 14వ ఆర్థిక సంఘం.. బీజేపీ సన్నాసుల్లారా ఒకసారి వినండి.. 14వ ఆర్థిక సంఘం బీహార్ కు లక్షా అరవై వేల కోట్లు ఇవ్వమందా సన్నాసుల్లారా? మీరు మనుషులేనా?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.