: కుమార్తెలే మేలు... వారే మన వారసులు: అమితాబ్ బచ్చన్
సామాజిక మాధ్యమాల ద్వారా అమితాబ్ అభిమానులకు దగ్గరగా ఉంటూ, తాను చెప్పదలచుకున్న విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా, కుమార్తెల గురించి ఆయన ట్వీట్ చేశారు. ‘కుమార్తెలే మేలు.. వారిని రక్షించండి, చదివించండి..!! వారే మన వారసులు’ అంటూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన కుమార్తె శ్వేతానందతో గతంలో దిగిన రెండు ఫొటోలను ఈ సందర్భంగా బిగ్ బీ పోస్ట్ చేశారు.