: కాంగ్రెస్ నేత ‘గాదె’కు టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు
ఏపీలో అధికార టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో తాజాగా, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘గాదె’కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, తాను టీడీపీలో చేరనున్న విషయాన్ని గాదె వెంకటరెడ్డి నిన్ననే ప్రకటించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే తాను టీడీపీలోకి వస్తున్నట్లు గాదె పేర్కొన్న విషయం తెలిసిందే.