: మహిళపై పోలీసు అధికారి ప్రతాపం.. సోషల్ మీడియాలోకి ఎక్కిన దృశ్యాలు
బీహార్ రాజధాని పాట్నాలో మహిళపై ఓ పోలీసు అధికారి దాడి చేస్తుండగా కెమెరా కంటికి చిక్కిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అక్కడి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని భూమిలో కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఆ స్థలం నుంచి వారిని ఖాళీ చేయించే క్రమంలో ఒక బిల్డర్ తన అనుచరులతో వారిపై దాడికి దిగగా, అక్కడ నివసిస్తోన్న వారు తిరిగి దాడి చేశారు. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులను చూసి సదరు బిల్డర్ అనుచరులు పారిపోయారు. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న వారిపై పోలీసులు దాడికి దిగారు. దీనిలో భాగంగా ఓ పోలీసు అధికారి మహిళపై చేయి చేసుకుంటుంగా ఓ కెమెరా కంటికి ఈ దృశ్యాలు చిక్కాయి. తరువాత సోషల్ మీడియాలోకి ఎక్కేశాయి. మహిళపై అనుచితంగా ప్రవర్తించి, చేయి చేసుకున్న పోలీసు అధికారిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.