: ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్ మహిళల జట్టు
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లోకి భారత్ మహిళల జట్టు బాణంలా దూసుకుపోయింది. టాప్ సీడ్ జర్మనీని మట్టి కరిపించిన భారత్ 5-3 స్కోరుతో ఫైనల్ కి చేరింది. చైనీస్ తైపీతో ఆదివారం నాడు జరగనున్న ఫైనల్లో భారత మహిళల రికర్వ్ బృందం తలపడనుంది. వ్యక్తిగత ఈవెంట్లలో ఆర్చర్లు దీపికా కుమారి, లక్ష్మీరాణి, బాంబేలా నిరాశపరిచినప్పటికీ తిరిగి పుంజుకుని జర్మనీని ఓడించారు. తొలిరౌండ్లో 2-0, రెండో రౌండ్లో 3-1తో దూసుకెళ్లిన భారత బృందం మూడో రౌండ్లో కొంచెం తడబడింది. దీంతో జర్మనీ పుంజుకుంది. స్కోరును 3-3తో సమం చేసింది. దీంతో అప్రమత్తమైన దీపిక, లక్ష్మీరాణి, బాంబాలే 5-3కు స్కోరును పెంచి భారత్ ను ఫైనల్లోకి చేర్చారు.