: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారుల మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీలో విషాదం చోటుచేసుకుంది. క్విలా పోలీసు స్టేషన్ పరిధి కాళీధామ్ ఆలయ సమీపంలోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో పెద్దలెవరూ లేరు. ఇంట్లోని పెద్దలు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆరుగులు చిన్నారులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో వారంతా సజీవదహనమయ్యారు. ఆ సమయంలో వెలుగుతూ ఉన్న కొవ్వొత్తి వల్లే మంటలు వ్యాపించాయని పోలీసులు భావిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.