: టీడీపీ నేతల తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది: కేటీఆర్
తెలుగుదేశం పార్టీ నేతల తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అయితే, ఈరోజున తెలుగుదేశం పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీతో కలవడం ఎంతో విడ్డూరమన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పాలేరు ఉప ఎన్నికకు మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. పాలేరు ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ తో పాటు 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.