: 31 అంతస్తుల ఆదర్శ్ బిల్డింగ్ సొసైటీని కూల్చేయాలి: ‘ఆదర్శ్ కుంభకోణం’ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
మహారాష్ట్ర ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో బాంబే హైకోర్టు ఈరోజు సంచలన తీర్పును చెప్పింది. 31 అంతస్తుల ఆదర్శ్ బిల్డింగ్ సొసైటీని కూల్చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. స్కాంతో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ అంశంపై మొదట్లోనే స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై విచారణ ప్రారంభించాలని సూచించింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న అమర వీరుల కుటుంబాలు, ఇతర సైనికుల కోసం ఆదర్శ్ సొసైటీ పేరుతో మొదట ఆరు అంతస్తులు నిర్మించాలని భావించి నిర్మాణాన్ని తలపెట్టారు. అయితే అనంతరం ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవనాన్ని కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన మృతుల కుటుంబాల కోసం నిర్మించగా, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు తమ కుటుంబ సభ్యులకు ఫ్లాట్లను కేటాయించుకున్నారు.