: పాతబస్తీ మెటర్నటీ ఆసుపత్రి వద్ద వైద్యుల ఆందోళన
హైదరాబాద్ పాతబస్తీ మెటర్నటీ ఆసుపత్రి వద్ద వైద్యులు ఆందోళన నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ డాక్టర్ ను పేషెంట్ల బంధువులు కొట్టినందుకు నిరసనగా వైద్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ వారు విధులను బహిష్కరించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అత్యవసర సేవలను సైతం వైద్యులు నిలిపివేశారు.