: నాంపల్లిలో దొరికిపోయిన బురఖా దొంగ
హైదరాబాద్ నగరంలో చోరీలకు పాల్పడుతున్న బురఖా ధరించిన దొంగ నాంపల్లి పోలీసులకు దొరికిపోయాడు. నాంపల్లి పోలీసులు ఈరోజు అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 44 తులాల బంగారంతో పాటు, రూ.19,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.