: టెక్నాల‌జీతో అవినీతికి అడ్డుక‌ట్ట వేస్తున్నాం!: ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు


గత రెండేళ్లుగా సరిపడినంతగా వర్షాలు ప‌డ‌లేద‌ని, కరవును ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో అన్ని చర్యలు చేపడుతున్నామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని బ్రాహ్మణపల్లిలో నీరు-చెట్టు పనులను చంద్ర‌బాబు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్రంలో వ‌ర్షాభావంతో ఇబ్బందులు ఉన్నాయని, అన్ని చెరువుల‌కు మ‌ర‌మ్మతులు చేప‌డుతామ‌ని చెప్పారు. వర్షపు నీటిని భూగర్భజలంగా మార్చుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో లక్ష ఎకరాలకు కావల్సిన పంట సంజీవనిని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆర్థిక వ‌న‌రులు లేకపోయినా ధైర్యంతో ముందుకు వెళ్తున్నామ‌ని చెప్పారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. టెక్నాల‌జీతో అవినీతికి అడ్డుక‌ట్ట వేస్తున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News