: ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీ ప్రభుత్వం తనిఖీలు చేసుకోవచ్చు: హైకోర్టు ఆదేశాలు


హైకోర్టులో తెలంగాణ సర్కార్ కు ఊరట లభించింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించవచ్చని హైకోర్టు అనుమతిచ్చింది. పోలీసులు, విజిలెన్స్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. స్కాలర్ షిప్ అవకతవకలపై విజిలెన్స్ విచారణకు కోర్టు అనుమతిచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలపై నిన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ప్రభుత్వం ఆశ్రయించడంతో అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతుండడంపై విచారణకు గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విచారణ తనిఖీల నేపథ్యంలో, టెట్, ఎంసెట్ ఎంట్రన్స్ ల నిర్వహణకు తాము సహకరించమని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ముందుగా ప్రకటించిన తేదీకి జరగాల్సిన టెట్, ఎంసెట్ లు వాయిదా వేస్తున్నట్లు టీ సర్కార్ నిన్న ప్రకటించింది. అయితే, మే 20 లోగా ఈ రెండు ఎంట్రన్స్ లు నిర్వహించుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News