: బెదిరింపులొస్తున్నాయి!... కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కల్పించండి!: హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్


టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైకోర్టును ఆశ్రయించారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి భద్రత కల్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సదరు పిటిషన్ లో రేవంత్ రెడ్డి పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వంపై గాని, రాష్ట్ర పోలీసు శాఖపై గాని నమ్మకం లేదని సంచలన ఆరోపణ చేశారు. తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News