: ఫోరం మాల్ లో విరాట్ కోహ్లీ!... హైదరాబాదులో సందడి చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ హైదరాబాదు వచ్చాడు. నగరంలోని ఫోరం మాల్ కు వెళ్లిన అతడు అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొద్దిసేపటి క్రితం పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా అక్కడి ఫ్యాన్స్ వేసిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు. నిర్వాహకులు వారిస్తున్నా చాలా సమయాన్ని వెచ్చించి పూర్తి స్థాయిలో కోహ్లీ సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి అతడికి వ్యక్తిగతమైనవే కాకుండా కెరీర్ పరంగా కూడా ప్రశ్నలు వెల్లువెత్తాయి. వాటన్నింటికీ అతడు ఓపిగ్గానే కాకుండా సవివరంగా సమాధానాలు ఇచ్చాడు. ఆ తర్వాత సెల్ఫీ స్టిక్ చేతబట్టి అభిమానులతో సెల్ఫీలు తీసుకుని సందడి చేశాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ తమ ప్రశ్నలకు సమాధానాలిస్తున్న తీరుకు సంబరపడిపోయిన హైదరాబాదీలు కేరింతలు కొట్టారు.