: పాల‌మూరు ప్రాజెక్టును అడ్డుకుంటే కాంగ్రెస్‌, టీడీపీలను భూస్థాపితం చేస్తాం: హ‌రీశ్ రావు


‘పాల‌మూరు ప్రాజెక్టును అడ్డుకుంటే కాంగ్రెస్‌, టీడీపీలను భూస్థాపితం చేస్తాం’ అని తెలంగాణ‌ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హ‌రీశ్ రావు హెచ్చ‌రించారు. ప్రాజెక్ట్ కడితే రాజకీయ భవిష్యత్ ఉండ‌ద‌నే ప్ర‌తిప‌క్షాలు కుట్ర చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఆర్డీఎస్ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపామ‌న్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈరోజు శంకుస్థాప‌న చేసిన‌ అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకం దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. దీనికి సహకరించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో మేరకే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News