: సుష్మా స్వరాజ్ కు రాహుల్ గాంధీ పరామర్శ!....ఎయిమ్స్ కు వెళ్లి పలకరించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నాలుగు రోజులుగా ఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో ఆమె ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుష్మా ఆరోగ్యం కాస్తంత మెరుగుపడినా, పూర్తిగా నయం కాలేదని వైద్యులు చెప్పారు. మంత్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిన తర్వాత ఆమెను డిశ్చార్జీ చేస్తామని వారు తెలిపారు. ఇదిలా ఉంటే, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్ కు వెళ్లి సుష్మాను పరామర్శించారు. సుష్మా ఆరోగ్యంపై అక్కడి వైద్యులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News