: పాలేరులో విజయం కాంగ్రెస్ దేనన్న భట్టి!... పార్టీ అభ్యర్థిగా సుచరితారెడ్డి నామినేషన్


ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి రాంరెడ్ది వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క వెంటరాగా... ఆమె తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... పదవిలో ఉండగా చనిపోయిన నేతల కుటుంబాలకు చెందిన వారినే ఆయా స్థానాలకు ఏకగ్రీవంగా ఎంపిక చేయాలన్న సంప్రదాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ దమన నీతిని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీకి షాకిచ్చే తీర్పు ఇస్తారని ఆయన చెప్పారు. సుచరితా రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News