: టీవీ షోలో రాళ్ల వర్షం!... కేరళ మంత్రికి రక్త గాయాలు!


మొన్న ఓ తెలుగు టీవీ చానెల్ లైవ్ షోలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్ది భాస్కరరెడ్డిల మధ్య కొనసాగిన బూతు పురాణం జనాన్ని విస్మయానికి గురి చేసింది. తాజాగా నిన్న కేరళలో జరిగిన ఓ టీవీ షోలో పాల్గొన్న రాజకీయ నేతలపై జనం రాళ్ల వర్షం కురిపించారు. ఊహించని ఈ దాడిలో కేరళ కార్మిక శాఖ మంత్రి బేబీ జాన్, లెఫ్ట్ కూటిమికి చెందిన విజయ్ పిళ్లైలు తీవ్రంగా గాయపడ్డారు. కేరళలో జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని అక్కడి ఓ ప్రాంతీయ న్యూస్ చానెల్ నిన్న నిర్వహించిన టీవీ షోకు బేబీ జాన్ తో పాటు విజయ్ పిళ్లైలు హాజరయ్యారు. జనం అడుగుతున్న ప్రశ్నలకు బేబీ జాన్ బదులిస్తుండగా... ఉన్నట్టుండి వారిద్దరిపై రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత తాము కూర్చున్న కుర్చీలను గాల్లోకి లేపిన జనం వాటిని ఇద్దరు నేతలపై విసిరారు. ఈ దాడిలో రక్త గాయాలైన నేతలను ఆసుపత్రికి తరలించిన టీవీ యాజమాన్యం చికిత్స చేయించింది.

  • Loading...

More Telugu News