: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ను తరిమేవరకు నిద్రపోవద్దు: కేటీఆర్‌


తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని త‌రిమేవ‌ర‌కు నిద్ర‌పోవ‌ద్ద‌ని రాష్ట్ర‌ మంత్రి కేటీఆర్ పార్టీశ్రేణుల‌కు, ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. పాలేరు విజయాన్ని కేసీఆర్‌కు కానుకగా ఇస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. పాలేరు ఉప ఎన్నికకు తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేసిన‌ సందర్భంగా ఈరోజు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పాలేరులో అదే పార్టీతో కలిసి పోటీ చేయడంపై ఆయ‌న విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పొత్తు దివాళాకోరుతనమని మండిప‌డ్డారు. అసాధారణ పరిస్థితిలో పాలేరు ఉప ఎన్నిక వచ్చింద‌ని, పాలేరు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్షాలు చీకటి రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News