: గుంటూరులో చంద్రబాబు... ఐటీసీ ఫైవ్ స్టార్ హోటల్ కు భూమి పూజ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం గుంటూరుకు చేరుకున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు గుంటూరుకు వచ్చిన ఆయన నేటి సాయంత్రం దాకా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా నగరంలో ఐటీసీ కొత్తగా నిర్మించనున్న ఫైవ్ స్టార్ హోటల్ కు ఆయన భూమి పూజ చేశారు. దాదాపు రూ.450 కోట్లతో నిర్మిస్తున్న ఈ హోటల్ లో 12 అంతస్తులు వుంటాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధానికి కేంద్రంగా మారిన గుంటూరు జిల్లాలో పెద్దగా స్టార్ హోటళ్లు లేవు. ఈ కారణంగా ప్రభుత్వ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన ఐటీసీ ఈ హోటల్ ను నిర్మిస్తోంది.