: పాలేరులో నామినేషన్ వేసిన తుమ్మల... మరికాసేపట్లో సుచరిత నామినేషన్


ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్దిసేపటి క్రితం తన నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెంట రాగా ఆయన కొద్దిపేసటి క్రితం రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక తుమ్మలకు ప్రధాన పోటీదారుగా భావిస్తున్న సుచరితారెడ్డి మరికాసేపట్లో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

  • Loading...

More Telugu News