: బయోమ్యాక్స్ మంటలు ఆరిపోయాయి!... 54 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది


విశాఖ జిల్లా దువ్వాడ సెజ్ లోని బయోమ్యాక్స్ కంపెనీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో అగ్ని కీలలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. మొన్న(మంగళవారం) రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా కంపెనీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు భారత నావికా దళం రంగంలోకి దిగినా ఫలితం కనిపించలేదు. కంపెనీలోని ఆయిల్ ట్యాంకర్లు పేలిన కారణంగా సదరు ట్యాంకర్లలోని ఆయిల్ మొత్తం కాలిపోయే దాకా మంటలు అదుపులోకి రాలేదు. దాదాపుగా 54 గంటల పాటు కొనసాగిన సహాయక చర్యలతో నేటి తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో ఇటు అధికారులతో పాటు అటు దువ్వాడ పరిసర గ్రామాల ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News