: చంద్రబాబు చేతులు చాపితే... దేవాన్ష్ ఏడుస్తూ దూరంగా వెళ్లాడు!: చంద్రబాబు కష్టాన్ని ఏకరువు పెట్టిన గంటా


పాలనలో తలమునకలై... ఏం కోల్పోతున్నారో మీకు తెలుస్తోందా? అంటూ నిన్న వేదికపైనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆ తర్వాత నిజమే... మనవడితో ఆడుకునే సమయం కూడా చిక్కడం లేదని ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు చెప్పారు. ఇక పాలనకే ప్రాధాన్యమిస్తూ ఇంటికి దూరంగా ఉంటున్న చంద్రబాబుకు ఇటీవల ఎదురైన ఓ వింత అనుభవాన్ని ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నిన్న చేరికల వేదిక మీద మాట్లాడిన సందర్భంగా గంటా చెప్పిన సదరు ఘటన... అక్కడున్న వారిని షాక్ కు గురి చేసింది. సొంత మనవడిని కూడా చూసుకోలేనంత బిజీగా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడుతున్నారని గంటా అన్నారు. ఇటీవల సుజనా చౌదరి కొడుకు వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాదు వెళ్లిన చంద్రబాబు... ఆ కార్యక్రమం తర్వాత ఇంటికెళ్లారని చెప్పారు. ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ ను ఎత్తుకునేందుకు చంద్రబాబు చేతులు చాపితే... ఆ చిన్నారి చంద్రబాబు వద్దకు రాలేదని చెప్పారు. తాత దగ్గరకు రాకపోవడమే కాక దేవాన్ష్ ఏడుస్తూ తన తండ్రి లోకేశ్ వద్దకు వెళ్లిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని లోకేశే తనకు స్వయంగా చెప్పారని, ఇది తనకు ఎంతగానో బాధ అనిపించిందని గంటా అన్నారు.

  • Loading...

More Telugu News