: పల్నాడులో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రధాని హామీ: ఎంపీ రాయపాటి
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. 253 గ్రామాల్లో రూ.1,150 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు. సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధులతో పల్నాడులో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని రాయపాటి పేర్కొన్నారు.