: హెచ్సీయూలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్, రోహిత్ తల్లిని అడ్డుకున్న పోలీసులు


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ)లో అంబేద్కర్ మనవడు ప్రకాశ్, రోహిత్ వేముల తల్లి రాధికను పోలీసులు అడ్డుకున్నారు. హెచ్సీయూ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వారిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ, విద్యార్థుల డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం హెచ్సీయూ విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.

  • Loading...

More Telugu News