: చంద్రబాబూ!.. ఒక్క రూపాయి కూడా దోచుకోలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేస్తారా?: ఎమ్మెల్యే రోజా


ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా దోచుకోలేదని, అవినీతికి పాల్పడలేదని అంటున్న చంద్రబాబుకి కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయా? అని నగరి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. ‘చంద్రబాబు ఆరోజు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచాడు. ఈరోజు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆరోజున ఎన్టీఆర్ ని చంపేశారు.. ఈరోజున వైఎస్సార్సీపీ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు. ఆరోజు ఎన్టీఆర్ ని సమాధి చేశారు.. ఈరోజున ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేస్తున్నారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను కొన్నారు.. ఈరోజు, విజయవాడలో చంద్రబాబు ఉంటున్న అక్రమ కట్టడంలో ఎమ్మెల్యేలను కొంటున్నాడు’ అని రోజా తీవ్రమైన ఆరోపణలు చేశారు.

  • Loading...

More Telugu News