: టైమ్ కు డబ్బులిచ్చారు, మంచి సినిమా తీశారు: హీరో అభిజిత్


‘నిర్మాతలు టైమ్ కు డబ్బులిచ్చారు. మంచి సినిమా తీశారు. ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో జీలకర్ర బెల్లం చిత్రం తీశారు’ అని హీరో అభిజిత్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కథలు లేవని అంటున్న తరుణంలో మంచి కథతో రూపొందిన చిత్రం ‘జీలకర్రబెల్లం’ అని అన్నాడు. ‘ప్రేమ గిన్నెడు పాల లాంటిదైతే, ‘ఇగో’ చుక్క విషం లాంటిది. ఆ చుక్క విషం ఆ గిన్నెడు పాలల్లో కలవకుండా చూసుకోవడమే మంచి రిలేషన్ షిప్ కు ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఈ చిత్రం సారాంశం. ఈ డైలాగ్ ని కొమ్మనాపల్లి గణపతిరావు గారు రాశారు’ అని అభిజిత్ చెప్పాడు.

  • Loading...

More Telugu News