: ప్రధాని కార్యక్రమంలో ముగ్గురు ‘ఖాన్’లు ఒకే వేదికపైకి!
ఆ పనిని... బాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం చేయలేదు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. అసాధ్యం అనుకుని చాలా మంది డైరెక్టర్లు వదిలేసిన విషయాన్ని ఆయన సాధించారు. ఒకే వేదికపై ముగ్గురు ఖాన్ లను చూసే అవకాశాన్ని అభిమానులకు కల్పించనున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే, మోదీ సర్కార్ ఏర్పాటై రెండేళ్లు కావస్తున్న సందర్భంగా ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ‘జరా ముస్కురా దో’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు హాజరుకానున్నారు. కేవలం ఈ ముగ్గురినే కాదు బాలీవుడ్ కు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను కేంద్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆహ్వానించింది. ‘జర ముస్కురా దో’ కార్యక్రమాన్ని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు సహా మొత్తం అరవై వేల మంది అతిథులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.