: ఏపీలో రేప‌టి ఎంసెట్ య‌థాత‌థం.. పరీక్ష‌ నిర్వహణపై అయోమయం వద్దు: ఎన్టీఆర్ వర్సిటీ


నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్‌) ద్వారానే మెడిక‌ల్ కాలేజీల్లో ప్ర‌వేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ స్పందించింది. సుప్రీం ఆదేశాల‌ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేపు నిర్వ‌హించ‌నున్న‌ ఎంసెట్ ప‌రీక్షలో ఎటువంటి మార్పు లేద‌ని విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌య వైస్ చాన్స‌ల‌ర్ ర‌విరాజు తెలిపారు. ఎంసెట్ నిర్వ‌హ‌ణ‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురి కావద్దని ఆయ‌న సూచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స‌మాచారాన్ని తాము తీసుకున్నామ‌ని.. కానీ, రేప‌టి ఎంసెట్ య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News