: పప్పుసుద్ద లోకేష్ ను 'సీఎం' చేసేందుకు చూస్తున్న బాబు: ఎమ్మెల్యే రోజా
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచే సత్తా లేనటువంటి లోకేష్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఒట్టి పప్పుసుద్ద అని విమర్శించారు. గతంలో లోకేష్ చేసిన సవాళ్లను ఆమె ప్రస్తావించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై లోకేశ్ చేసిన సవాల్ ను గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో తెలిసిందేనన్నారు. దమ్ము, ధైర్యం గురించి మాట్లాడుతున్న లోకేష్ దమ్మేంటో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసునని రోజా విమర్శించారు.