: రూ.10 కోట్లకు అమ్ముడు పోయాననేది అవాస్తవం: కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన తాను రూ.10 కోట్లకు అమ్ముడుపోయాననేది అవాస్తవమని అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని, అమ్ముడుపోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. అదేవిధంగా, టీడీపీలోకి వెళ్లే ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారనేది అవాస్తవమంటూ ఆయన కొట్టిపారేశారు. కాగా, వారం రోజుల క్రితం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.