: అమరావతి ప్రతిష్ఠను దిగజార్చేందుకు జగన్‌ కుట్ర ప‌న్నారు: ప్రత్తిపాటి పుల్లారావు


వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ప‌ర్య‌టిస్తూ తెలుగు దేశం పార్టీపై ప‌లువురు జాతీయ నేత‌ల‌కు, అధికారుల‌కు ఫిర్యాదులు చేస్తోన్న నేపథ్యంలో గుంటూరులో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు మండిప‌డ్డారు. అమరావతి ప్రతిష్ఠను దిగజార్చేందుకు జగన్‌ కుట్ర ప‌న్నారని ప్ర‌త్తిపాటి ఆరోపించారు. భూస‌మీక‌ర‌ణ అంశంపై జ‌గ‌న్ చ‌ర్చ‌కు రావాల‌ని అన్నారు. భూముల‌ను రాజ‌ధాని కోసం ఇచ్చిన రైతులతో క‌లిసి త‌మ‌తో చ‌ర్చించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మేనా..? అని ప్ర‌శ్నించారు. ఆర్థిక నేరస్థుల జాబితా నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నించ‌డానికే జ‌గ‌న్ ఢిల్లీలో నేత‌ల‌ను క‌లుస్తున్నార‌ని విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News