: నా మనవడిని చూడాలనిపించినా వెళ్లడం లేదు, ఎందుకంటే...: ఏపీ సీఎం


తన మనవడి కన్నా ప్రజలు, ప్రజాసమస్యలే తనకు ఎక్కువ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ‘నా మనవడిని చూడాలనిపించినా, కొంత సమయం గడపాలన్నా నేను వెళ్లలేక పోతున్నాను. మీ కోసం నేను అన్ని త్యాగాలు చేశాను. అందుకే, ఈ రోజున నా మనవడిని చూడటం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాను. ప్రజాసమస్యలపై దృష్టి పెడుతున్నాను’ అన్నారు.

  • Loading...

More Telugu News