: రోడ్డు ప్రమాదంలో వైరా ఎమ్మెల్యేకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ కు గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం దగ్గర జరిగిన ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన కారు డ్రైవర్, ఆయన గన్ మెన్ లు ఆయన్ని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేను పరీక్షించిన వైద్యులు ఆయన నడుం భాగంలో బాగా దెబ్బలు తగిలాయని, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేను అప్పటికప్పుడు హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కాగా, ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.