: తదుపరి ఐపీఎల్ మ్యాచ్ లు కూడా భారత్‌లోనే జరగాలి: అనిల్ కుంబ్లే
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వచ్చే ఏడాది మరో దేశంలో జరపాలని గవర్నింగ్ కౌన్సిల్ భావిస్తోన్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే స్పందించాడు. భారత్‌లో వసతుల కొరత కారణంతో తదుపరి ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాలని నిర్వాహకులు చేస్తోన్న ప్రయత్నాలను అనిల్‌కుంబ్లే వ్యతిరేకించాడు. తిరువనంతపురంలోని 'త్రివేండ్రం స్పోర్ట్స్‌హబ్'లో ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్‌ని ఒక గ్లోబల్ బ్రాండ్ గా అభివర్ణించాడు. ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహించడం ద్వారా దేశానికి ఎంతో ఆదాయం వస్తుందన్నాడు. ఐపీఎల్ ను విదేశాలకు తరలించవద్దన్నాడు. తదుపరి ఐపీఎల్ భారత్‌లోనే జరగాలని వ్యాఖ్యానించాడు.