: బెంగళూరు తరహాలో హైద‌రాబాద్‌లో గణేష్ నిమజ్జనం చేయాలి: హైకోర్టు


హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సంద‌ర్భంగా జ‌రిగే కాలుష్యం అంశంపై హైకోర్టులో ఈరోజు విచారణ చేపట్టారు. హైద‌రాబాద్‌లో గణేష్ నిమజ్జన నిర్వ‌హ‌ణ‌ను బెంగళూర్‌ తరహాలో ఏర్పాట్లు చేస్తే హుస్సేన్‌సాగర్‌ కలుషితం కాదని హైకోర్టు అభిప్రాయప‌డింది. దీనికోసం హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలంగాణ స‌ర్కార్‌కి సూచించింది. విగ్రహాల తయారీలో సహజ రంగులను వాడాలని, విగ్రహాల ఎత్తు తగ్గించేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. సహజ రంగుల తయారీకి ఐదు కోట్ల రూపాయ‌లు మంజూరు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News