: బుడ్డా రాజశేఖరరెడ్డిదీ అదే మాట!... నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు ప్రకటన


వైసీపీ నుంచి శాసనసభ్యులుగా గెలిచిన ఎమ్మెల్యేలు 16 మంది ఇప్పటిదాకా కండువాలు మార్చేశారు. టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించిన వైసీపీని వదిలేసి... గడచిన ఎన్నికల్లో ఏ పార్టీతో అయితే పోరాడారో, అదే పార్టీ టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా పార్టీ మారడానికి ఈ ఎమ్మెల్యేలంతా చెప్పిన కారణం ఒక్కటే. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు వారు ప్రకటించారు. నేటి ఉదయం టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. నేటి ఉదయం టీడీపీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని తన తండ్రి సమానుడిగా అభివర్ణించారు. పేరు పరంగా తన నియోజకవర్గం శ్రీశైలానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ప్రకటించిన ఆయన... అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందని పేర్కొన్నారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకే తాను టీడీపీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News