: టీ సీఎల్పీ భేటీలో కలకలం!... భేటీని బహిష్కరించిన పొంగులేటి, కోమటిరెడ్డి


టీ కాంగ్రెస్ లో నిరసన గళాలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ప్రారంభమైన టీ సీఎల్పీ భేటీని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిష్కరించారు. సమావేశానికి పిలిచి అవమానించారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి విసవిసా బయటకొచ్చేశారు. ఈ ఘటనతో షాక్ కు గురైన టీ పీసీసీ పెద్దలు తేరుకునేలోగానే నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశాన్ని బహిష్కరించారు. ఆరు నెలలుగా నల్లగొండ డీసీసీకి అధ్యక్షుడినే నియమించలేదని నిరసన వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి వాకౌట్ చేశారు. పొంగులేటి వాకౌట్ సందర్భంగా ఆయన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో వాగ్వాదానికి కూడా దిగారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచామని ఉత్తమ్ చెప్పగా... ఆహ్వానం అందితేనే తాను భేటీకి హాజరయ్యానని పొంగులేటి వాదించారు. ఒకేసారి ఇద్దరు కీలక నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేయడంతో అక్కడ కలకలం రేగింది.

  • Loading...

More Telugu News