: మంచి ముహూర్తం కావడంతో టీడీపీ కండువా క‌ప్పించుకున్న వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి


కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి టీడీపీలో చేరారు. ఈ ఉదయం 9.05 గంటలకు మంచి ముహూర్తం ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన ప‌సుపు కండువా క‌ప్పించుకున్నారు. అయితే తాడేప‌ల్లిలో ఈరోజు నిర్వ‌హించ‌నున్న ఓ కార్య‌క్ర‌మంలో రాజశేఖర్‌రెడ్డిని అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి మద్దతుదారులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మ‌రోవైపు అరకు వైసీపీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి కూడా టీడీపీలో చేర‌నున్నారు.

  • Loading...

More Telugu News