: ఇకపై ఇంకుడు గుంతలు ఉంటేనే భవన నిర్మాణాలకు అనుమతి: హైకోర్టు


ఇకపై ఇంకుడు గుంతలు ఉంటేనే భవన నిర్మాణాలకు అనుమతులివ్వాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలను హైకోర్టు ఆదేశించింది. ఇంకుడు గుంతల ఏర్పాటు సంబంధిత జీవో అమలు కావట్లేదంటూ న్యాయవాది వైదేహిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారని, ఇందుకు సంబంధించిన నిబంధనలు ఎందుకు అమలు చేయట్లేదని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలను హైకోర్టు ప్రశ్నించింది. ఇంకుడు గుంతల ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక ఏంటో తెలపాలని, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని, భవన నిర్మాణ పథకంలోనే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని సూచించాలని, భవన నిర్మాణాలపై వివిధ దశల్లో పర్యవేక్షణ ఉండాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News