: రాష్ట్ర ముఖ్యమంత్రికి కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి ‘తుమ్మల’: కేసీఆర్
‘పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఒక్క విషయం చెబుతున్నాను... ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు’ అనే సామెత చెబుతారు. తుమ్మల గారు ఈరోజు కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. పాలేరు ప్రజలారా, కలిసొచ్చే అదృష్టంలాగా మీకు కలిసొచ్చింది. తుమ్మల గారిని బ్రహ్మండమైన మెజార్టీతో గెలిపించుకోండి. ఊహించని విధంగా ఆయన అభివృద్ధి చేస్తారు. వారికి అన్ని విధాలా అండదండగా నేను ఉంటానని చెప్పి పాలేరు ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నాను. బ్రహ్మండమైన మెజార్టీతో తుమ్మలగారు గెలవబోతున్నారని మాకు రిపోర్టులు వస్తున్నాయి’ అని కేసీఆర్ అన్నారు.