: ఆకుపచ్చ తెలంగాణ చూడాలన్నదే నా కోరిక: కేసీఆర్


ఆకుపచ్చ తెలంగాణను చూడాలన్నదే తన కోరికని, వేరే కోరికలేవీ తనకు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రతి బిడ్డ చిరునవ్వుతో, కళకళలాడే ముఖంతో ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణలో 80 శాతం మంది బడుగు,బలహీన వర్గాల ప్రజలే ఉన్నారని, నలభై ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, సమాజం పరిస్థితి తనకు తెలుసునని అన్నారు. తెలంగాణ బిడ్డలందరూ ముందుకు పోవాలన్నదే తమ అజెండా అని, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు రూ.35 వేల కోట్లతో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

  • Loading...

More Telugu News