: పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుంది: కడియం శ్రీహరి
పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ నేత, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఖమ్మంలో టీఆర్ఎస్ 15వ ప్లీనరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని ఎన్నికల్లోను టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని కడియం అన్నారు.