: ఒక ఎంపీ గుర్రమెక్కారు, మరో ఎంపీ సైకిలెక్కారు: బీజేపీ ఎంపీల నిరసన


వాయు కాలుష్యం నియంత్రణకు గాను దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశ పెట్టిన సరి-బేసి సంఖ్య విధానం రెండో విడత ప్రస్తుతం అమలులో ఉంది. దీంతో, చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ బీజేపీ, ఇతర పార్టీల ఎంపీలు వ్యాఖ్యానించడమే కాదు, తమ నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు పార్లమెంట్ కు వచ్చిన ఎంపీల్లో కొందరు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ గుర్రంపై, ఢిల్లీకి చెందిన మరో ఎంపీ మనోజ్ తివారీ సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు. ‘పొల్యూషన్ ఫ్రీ వెహికల్’ అనే పదాలు రాసున్న ఒక కార్డు బోర్డును శర్మ తన గుర్రానికి తగిలించారు. రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఢిల్లీ మాజీ అధ్యక్షుడు విజయ్ గోయెల్ తన కారుకు ‘ఆడ్ ఈవెన్ నో గెయిన్, ఓన్లీ పెయిన్’ అనే నినాదం ఉన్న పోస్టర్ల ను అతికించుకుని పార్లమెంట్ కు రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News