: ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం వాష్ రూమ్ లో ఏడు కిలోల బంగారం !


ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం వాష్ రూంలో చాలా విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్ ను ఎవరో విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ ఆభరణాలు 7.12 కిలోల బరువు ఉన్నాయి. ఈరోజు ఖతార్ నుంచి వచ్చిన విమానం గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. తనిఖీలలో భాగంగా విమానంలో తనిఖీ చేస్తుండగా వాష్ రూంలో ఒక మూలన ఒక నలుపు రంగు బ్యాగ్ అధికారుల కంటపడింది. ఆ బ్యాగ్ ను బయటకు తీసుకువచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. 7.12 కిలోల బరువున్న వాటి విలువను నిర్ధారించాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News