: మైసూరారెడ్డి పార్టీకి దూరమై చాలా రోజులైంది!: వైఎస్ జ‌గ‌న్‌


వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి, త‌నపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్‌.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై రాసిన పుస్తకాన్ని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి అంద‌జేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... మైసూరా రెడ్డి పార్టీకి దూరమై చాలా రోజులు అయిందని ఆయ‌న అన్నారు. అంతేకాదు, తాను మైసూరారెడ్డిని చూసి ఆరు నెలలు అవుతోందని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అరుణ్‌జైట్లీకి వివ‌రించాన‌ని జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు అవినీతిపై అరుణ్ జైట్లీకి చెప్పానని ఈ విష‌య‌మై చంద్రబాబుపై విచార‌ణ జ‌రిపించాల‌ని విన్న‌వించాన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News