: అందుకే, ‘సరైనోడు’లో విలన్ గా నటించాను: హీరో ఆది పినిశెట్టి
‘సరైనోడు’ చిత్రంలో హీరోకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, విలన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే, ఈ చిత్రంలో తాను నటించానని దక్షిణాది హీరో ఆది పినిశెట్టి అన్నారు. ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకుగాను తన ఆలోచనను పక్కనపెట్టి, దర్శకుడు బోయపాటి శ్రీను మైండ్ లో ఏముందో అదే చేశానని చెప్పారు. ‘సరైనోడు’ వంటి కమర్షియల్ చిత్రానికి ఆయన చెప్పిన విధంగా చేయడమే కరెక్టు అని ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తోందన్నారు. ఈ చిత్రం చూసిన ప్రతిఒక్కరూ తన పాత్ర బాగుందని చెబుతున్నారని, ఆ క్రెడిట్ అంతా బోయపాటికే దక్కుతుందని అన్నారు. తాను డైరెక్టర్ కొడుకునే అయినప్పటికీ చిత్రాలకు దర్శకత్వం వహించే అంత బుర్ర మాత్రం తనకు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆది పినిశెట్టి నవ్వుతూ చెప్పారు.