: పరీక్ష హాల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది
పరీక్షలు రాయడానికి వచ్చి పరీక్ష హాల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందో మహిళ. బీఏ మూడో సంవత్సరం పరీక్షలు రాయడానికి వచ్చిన నెలలు నిండిన మహిళకు పరీక్షా కేంద్రం వద్ద నొప్పులు వచ్చాయి. దీంతో పరీక్ష కేంద్ర సిబ్బంది వైద్యులకు ఫోన్ చేశారు. అయితే వైద్యులు అక్కడికి చేరుకునేలోపే ఆ మహిళ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ గిరిధ్ జిల్లా ధనావర్ ప్రాంతంలోని సరియా కాలేజీలో చోటుచేసుకుంది. తాను నెలలు నిండిన గర్భవతి అయుండి కూడా పరీక్షలకు హాజరు కావాలనే పట్టుదలతో పరీక్ష కేంద్రానికి రావడంతో ఈ ఘటన జరిగింది.